మరో 17 వన్డేల తరువాత మెగా ఈవెంట్...

SMTV Desk 2018-10-23 17:00:29  Team India ,Worldcup,

న్యూఢిల్లీ అక్టోబర్23:టీంఇండియా కి ప్రపంచకప్ కౌంట్ డౌన్ మొదలయింది.మరో 17 వన్డేల తరువాత మెగా ఈవెంట్ మొదలవబోతుంది .విండీస్ వన్డే సిరీస్ తరువాత సమీకరణం 13 వన్డేలకు తగ్గనుంది. కాగా సేనియర్ ఆటగాళ్ళు చాలా ఆసక్తిగా ఫాం లోకి రావడానికి సిద్దమవుతున్నారు. యువ కెరటం పృథ్వీ షా ప్రదర్శనపై అందరి చూపులు నెలకొన్నా.. తామూ రేసులో ఉన్నామంటూ అజింక్య రహానె, అశ్విన్‌, దినేశ్‌ కార్తీక్‌లు పోటీపడుతున్నారు. మిడిల్‌ ఆర్డర్‌ కూర్పు ఇంకా కుదరలేదు. అంబటి రాయుడు సరైనోడు అంటున్నారు కానీ అతడినీ పూర్తిగా పరీక్షించాల్సి ఉంది. దీంతో దేవధర్‌ ట్రోఫీలో సత్తా చాటి మళ్లీ జట్టులోకి రావాలని రహానె భావిస్తున్నాడు. వన్డే జట్టు తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్టు కనిపిస్తోన్నా, ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ ఇంకా పట్టుదలగానే కనిపిస్తున్నాడు. జడేజా మాదిరిగానే తనూ మళ్లీ రాగలనని నమ్మకంగా ఉన్నాడు. పేలవ ప్రదర్శన చేయకపోయినా, రిషబ్‌ పంత్‌ బాగా ఆడుతున్న కారణంగా దినేశ్‌ కార్తీక్‌పై వేటు పడింది.ఇక్కడ రాణించి సెలక్టర్ల మెప్పు పొందాలని కార్తీక్‌ భావిస్తున్నాడు. ఇండియా ఏ, బి, సి జట్లు పోటీపడుతున్న దేవధర్‌ ట్రోఫీ నేటి నుంచి ఢిల్లీలో జరుగనున్నది.అలాగే దినేష్ కార్తీక్ ఎ జట్టుకు సారథ్యం వహించగా,శ్రేయాష్ అయ్యర్ బి జట్టుకి,అజింక్య సి జట్టుకు వున్నారు.