10 శాతం పెరిగిన కెనరా బ్యాంకు వృద్ది

SMTV Desk 2017-07-20 15:42:04  cannera bank, intrest, income, shares

న్యూఢిల్లీ, జూలై 20 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నికర లాభ వృద్ది 10 శాతానికి పరిమితమైంది. సుమారు రూ.252 కోట్ల లాభాన్ని ప్రభుత్వరంగ కెనరా బ్యాంక్‌ నమోదు చేసింది. 2016-17 కాలంలో ఆర్జించిన లాభం రూ.228.95 కోట్లతో పోలిస్తే, ఈసారి లాభం 9.9 శాతంకు చేరుకుంది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.11,786 కోట్ల నుంచి 12,304 కోట్లకు చేరింది. అయితే ప్రధానమైన వడ్డీ ఆదాయం మాత్రం రూ.10,201.70 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ.10,195.59 కోట్లకు చేరింది. పెట్టుబడులపై ఆదాయం రూ.2,505.11 కోట్ల నుంచి రూ.2,733 కోట్లకు పెరిగింది. బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) పరిమాణం 9.71 శాతం నుంచి 10.56 శాతానికి చేరాయి. ఇదేవిధంగా నికర ఎన్‌పీఏలు కూడా 6.69 శాతం నుంచి 7.09 శాతానికి పెరిగాయి. ఫలితంగా మొండి బకాయిలకు బ్యాంకు కేటాయింపులు రూ.1,468 కోట్ల నుంచి భారీగా పెరిగి రూ.2,270 కోట్లకు పడగలెత్తింది. తొలి త్రైమాసికం ముగిసే సరికి కేటాయింపుల నిష్పత్తి 54.52 శాతంగా ఉంది. బ్యాంకు ఆస్తులు రూ.5,39,767.21 కోట్ల నుంచి రూ.5,79,875.32 కోట్లకు చేరుకున్నాయి.