నేడు ముంబయి ఎయిర్ పోర్టు బంద్ !

SMTV Desk 2018-10-23 13:18:31  Mumbai Airport ,Chatra Pati SHivaji Airport

ముంబయి , అక్టోబర్ -23 : ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ఇవాళా మూసివేయనున్నారు. మెయిన్, సెకండరీ రన్‌వేల మరమ్మతులు జరుపుతున్న కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. అక్టోబరు 23న విమానాశ్రయంలో ఆరు గంటల పాటూ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ముంబయి ఎయిర్‌పోర్టు ఈ నెల 4నే తెలిపింది. రెండో విడత మరమ్మతులను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 30 వరకూ (మార్చి 21 మినహా) చేపడతామని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. ముంబయి ఎయిర్ పోర్టు మరమ్మతుల కారణంగా రీ షెడ్యూల్‌, రద్దు చేసిన విమాన సర్వీసుల వివరాలకు తమ వెబ్‌సైట్‌ సందర్శించాలని ఎయిర్‌ ఇండియా సంస్థ ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యం లో విదేశీ ప్రయాణికులు సతమతమవుతున్నరు