నేషనల్ స్టార్ ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్హలు

SMTV Desk 2018-10-23 12:58:49  prabhas , birth day,

హైదరాబాద్, అక్టోబర్ 23 : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇవాళ 39 వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు . బాహుబలి సినిమాతో ప్రపంచానికి తన సత్తా చాటి ఇప్పుడు నేషనల్ స్టార్ హీరోగా పేరు పొందాడు.

తెలుగు సినిమా హీరో గా .. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే రెబల్‌స్టార్‌గా ప్రభాస్‌ ఎదగడం వెనుక ఎంతో కృషి వుంది. మరెంతో పట్టుదల వుంది. అనుకున్న లక్ష్యాన్ని రీచ్‌ అవడానికి వేసిన ప్రతి అడుగులో ఇంకెంతో దీక్ష వుంది. కృషి, పట్టుదల, దీక్ష.. ఈ మూడూ ప్రభాస్‌ని కోట్లాది మంది అభిమానించే రెబల్‌స్టార్‌ని చేశాయి. ఈశ్వర్ తో కెరీర్ ప్రారంభించిన యంగ్ రెబల్ స్టార్.. కెరీర్ లో చేసిన మూడో సినిమాకే ఇండస్ట్రీని ఆకర్షించాడు. వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అప్పట్నుంటి మినిమం గ్యాప్ లో హిట్స్ ఇస్తూనే ఉన్నాడు. సినిమా, సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూనే ఉన్నాడు.

ఛత్రపతి... రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ప్రభాస్ జీవితంలోకి, అతడి కెరీర్ లోకి బాహుబలి వచ్చిన తర్వాత ఈ హీరో గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. బాహుబలి-1తో జాతీయస్థాయిలో మీడియాను ఎట్రాక్ట్ చేసిన ప్రభాస్.. బాహుబలి-2తో నేషనల్ లెవెల్లో స్టార్ అయిపోయాడు.

ఎన్ని సినిమాలు చేశాం అన్నది ముఖ్యం కాదు జనం ఎంతలా గుర్తు పెట్టుకునే పాత్ర చేశాం అన్నదే ముఖ్యమని.. ప్రతి పాత్రలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాడు. ఇన్ని క్వాలిటీస్ ఉండటం వల్లే నేషనల్ స్టార్‌గా మారారు రెబర్ స్టార్ ప్రభాస్.

ప్రస్తుతం కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో వస్తున్న చిత్రం సాహూ తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలం లో నిర్మిస్తున్నారు .