షూటింగ్ లో చరణ్ ఫొటోస్ లీక్

SMTV Desk 2018-10-16 15:38:30  RAM CHARAN , BOYAPATI SREENU , kiara advani DEVI SRI PRASAD

హైదరాబాద్ అక్టోబర్ 16 ; రంగస్థలం ఘనవిజయం తదుపరి మెగా పవర్‌స్టార్ రాంచరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం సింహాచలంలో జరుగుతుండగా.. అక్కడ కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగా ఫైట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందులో రామ్ చరణ్ లుక్ వాహ్వా అనిపిస్తోంది.ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ వొబెరాయ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్టైటిల్ విడుదల అవ్వనుంది.