దసరా కు టిఎస్‌ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు..!

SMTV Desk 2018-10-16 12:59:02  TSRTC , HYDRERABAD

హైదరాబాద్ అక్టోబర్ 16: 50% అదనపు ఛార్జీలుప్రైవేటు బస్సుల ఛార్జీల దోపిడిప్రయాణీకులతో కిక్కిరీసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు హైదరాబాద్‌: సద్దుల బతుకమ్మ….దసరాకు హైదరాబాద్‌ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే లక్షలాది మంది ప్రజలపై అదనపు ఛార్జీల భారం పడుతోంది. ఎంజీబీఎస్ ప్రాంగణం కిటకిటలాడుతున్నది. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు గాను టీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే అదనపు బస్సులను ఏర్పాటు చేయగా, 16 నుంచి 18 వరకు తేదీల్లో టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్ నుంచి పొరుగు రాష్ర్టాలకు ప్రయాణికుల సౌకర్యార్ధం 4480 అదనపు బస్సులను నడిపేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాలకు నడుపబడిన అదనపు బస్సుల వివరాలను ఎంజీబీస్ అధికారులు వివరించారు. 17,18వ తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న దృష్ట్యా అదనపు బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేశామని వివరించారు. ప్రయాణికులు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునేందుకు www//tsrtconline.in లో సంప్రదించాలన్నారు.