మొన్న కోహ్లికి,ఇవ్వాలా రోహిత్ కి

SMTV Desk 2018-10-15 18:19:27  rohith sharma,virat kohli,india

ముంబై;క్రికేటర్సే కాదు ఈ మధ్య అభిమానులు కూడా మైదానం లోకి దిగి సందడి చేస్తున్నారు.మొన్న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో భారత్-విండీస్ తో మ్యాచ్ జరుగుతుండగా వొక అభిమాని ఏకంగా మైదానం లోకి వెళ్లి విరాట్ కోహ్లిని హద్దుకొని ముద్దుపెట్టుకోబోయాడు.అటువంటి సంగటనే మల్లి భారత జట్టు వోపెనర్ రోహిత్ శర్మకు జరిగింది.

రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వో అభిమాని అకస్మాత్తుగా మైదానంలోకి పరుగెత్తుకొని వచ్చి రోహిత్ శర్మకు ముద్దు ఇవ్వబోయాడు. అంతేకాదు రోహిత్ శర్మ పాదాలకు కూడా నమస్కరించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మకు అమాంతం హత్తుకుని హగ్ ఇచ్చాడు. ఈ సమయంలో అభిమాని చేష్టలతో బిత్తరపోయిన రోహిత్ శర్మ ఇదేం పని అడిగాడు. అనంతరం అభిమాని అమితానందంతో మళ్లీ తన స్థానానికి వెళ్లిపోయాడు.విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తొలి క్వార్టర్ ఫైనల్స్‌లో రోహిత్ శర్మ ముంబై తరఫున బరిలోకి దిగాడు. బీహార్ జట్టు నిర్దేశించిన 70 పరుగుల లక్ష్య చేధనకు దిగిన ముంబై దూకుడుగా ఆడోతుంది.