రిషబ్ పంత్ గేమ్ చేంజర్: గంగూలి

SMTV Desk 2018-10-15 16:20:38  india,sourav ganguly,rishab pant, pruthvi shaw

కోల్‌కత్తా:భారత క్రికెట్ జట్టులో వో పక్క పృథ్వీ షా, మరోపక్క రిషబ్ పంత్ తమదైన శైలిలో ఆట ఆడుతూ మెరుస్తున్నారు.ఇద్దరూ యువ క్రికటర్ లే.ఈ మధ్య జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ పై అరంగేట్రం లోనే సెంచరీ చేసిన క్రికటర్ రిషబ్ పంత్(21),అలాగే విండీస్ సిరీస్ పై సెంచరీ తో పాటు టాప్ స్కోరర్ గా నిలిచి తన సత్తా చాటుకున్న క్రికెటర్ పృథ్వీ షా(18).వీళ్ళిద్దరి అరంగేట్రం చాలా ఘనంగానే జరిగింది.కాగా వీళ్ళిద్దరిలో మ్యాచ్ ని మలుపు తిప్పే సామర్ద్యం ఎవరికీ వుందని భారత మాజీ కెప్టన్ సౌరవ్ గంగూలీని ప్రశ్నించగా రిషబ్ పంత్ అంటూ జవాబిచ్చాడు.‘రిషబ్ పంత్ క్రీజులో చాలా ఉత్సాహంగా కనిపిస్తాడు.

అతని ఆట కూడా సహజసిద్ధంగా ఉంటుంది. అన్ని ఫార్మాట్లలోనూ మ్యాచ్‌ని మలుపు తిప్పగలిగే సామర్థ్యం అతనికి ఉంది. అతనొక గేమ్‌ ఛేంజర్‌’అంటూ అతన్ని పొగుడుతూ చెప్పాడు.ఈ మధ్య విండీస్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో పంత్ 92 పరుగులు చేసి,ఉప్పల్ జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో కూడా మల్లి అదే 92 వద్ద అవుటయ్యాడు.వరుసగా రెండు సార్లు శతకాన్ని చేజార్చుకున్నాడు.కానీ అతడు పరుగులు తీసే విధానం చూస్తే ఎంత దూకుడు మీద ఉన్నదో అర్ధమవుతుంది అని వివరించారు.