ప్రతిసారీ రక్తం వాంతి చేసుకుంటున్నా: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌

SMTV Desk 2018-10-15 15:26:08  australia allrounder,jan hesting

సిడ్నీ;ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జాన్‌ హేస్టింగ్స్‌ తన కెరీర్ ప్రమాదంలో పడిపోయింది.గత కొన్నేళ్ళుగా జాన్ హేస్టింగ్ అంతుచిక్కని జబ్బుతో బాధపడుతున్నాడు.అతడు బౌలింగ్ చేసిన ప్రతీసారి రక్తపు వాంతులు అవుతుండడం తో తన కరీర్ గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నాడు.అతనికి ఊపిరితిథుల్లో సమస్య వుంది అని డాక్టర్లు నిర్దారించారు.తను మాట్లాడుతూ ఎప్పుడు బౌలింగ్‌ చేసిన ప్రతిసారీ రక్తం వాంతి చేసుకుంటున్నా. కేవలం బౌలింగ్‌ చేస్తేనే.. పరిగెత్తితే కాదు. నేను బాక్సింగ్‌, రోయింగ్‌ చేయగలను. బరువులూ ఎత్తగలను. కానీ కేవలం బౌలింగ్‌ చేసినప్పుడే అలా జరుగుతోంది.
మ్యాచ్‌ సందర్భంగా బౌలింగ్‌ చేసినపుడు ఊపిరితిత్తుల నుంచి రక్తం ఎగజిమ్మి.. దగ్గినపుడు అది నోటి ద్వారా బయటకు వస్తోంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు అని వైద్యులు కచ్చితంగా చెప్పట్లేదు. ఇకపై నేను బౌలింగ్‌ చేస్తానో లేదో అంటూ వెల్లడించారు.జాన్ హేస్టింగ్ ఆస్ట్రేలియా తరపున వొక టెస్టు,9 టీ20లు,29 వన్డేలు ఆడాడు.