రాష్ట్రం లో విపత్తుల సమస్యల కంటే , రాజకీయ దోపిడీ ఎక్కువ...!

SMTV Desk 2018-10-15 15:15:45  chandrababu naidu , titli toofan, andhra pradesh CM

తిత్లీ తుపాను కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితిని పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రం లో ప్రకృతి వల్ల తలెత్తే సమస్యల కంటే రాజకీయ కుట్రలు తలనొప్పిగా మారాయని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు. అప్పుడు కేంద్రంలోవున్న పార్టీ ఇబ్బందిపెడితే.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోవున్న పార్టీ మరో రకంగా వివక్ష చూపిస్తోందని ఆరోపించారు


సమస్యల పరిష్కారంలో పోటీపడాలే తప్ప, కక్ష సాధింపు వైఖరి సరికాదన్నారు. హక్కులు డిమాండ్‌ చేస్తే దాడులు చేసే పరిస్థితి నెలకొందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమన్నారు సీఎం చంద్రబాబు. తుపాను బాధిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేసి అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులకు సూచించారు. మంగళవారం తాను శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికల్లా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.