పవన్ కవాతుకు పోలీసులు నోటీసులు జారీ

SMTV Desk 2018-10-15 13:36:28  Pawan Kalyan, Janasena Kavathu, Police issue Notification ,

రేపటి తరం భవిత కోసమే కదం తొక్కి కవాతు చేస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పోలీసులు ఆదిలోనే బ్రేక్ ఇచ్చారు.ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతుకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బ్యారేజీ పిట్టగోడలు బలహీనంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతుకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బ్యారేజీ పిట్టగోడలు బలహీనంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. అలాగే సభాప్రాంగణం కూడా 10వేల మందికంటే ఎక్కువ సరిపోదని, వేరే చోట సభను నిర్వహించుకోవాలని చెప్పారు. ఈ మేరకు రాజమండ్రి అర్బన్ పోలీసులు పవన్‌కు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ కవాతులో పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి పవన్ అభిమానులు వేలాదిమందిగా వచ్చారు. ఈ క్రమంలో పోలీసుల నోటీసుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.