టీంఇండియాకు మరో కొత్త రికార్డు...!

SMTV Desk 2018-10-15 13:34:51  testmatch,westindies,teamindia

హైదరాబాద్;హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా చేసుకొని భారత్-విండీస్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో నిన్న భారత్, విండీస్ ని చిత్తు చేసింది.

10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాదించగా,భారత జట్టు బౌలర్ ఉమేష్ యాదవ్ ఈ టెస్ట్ మ్యాచ్ లో మొత్తం 10 వికెట్లు తీసి భారత జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు.తొలి ఇన్నింగ్స్ లో గట్టి పోటీ ఇచ్చిన విండీస్,రెండో ఇన్నింగ్స్ లో కాస్త తడబడింది.ఇది ఇలా వుండగా భారత్ మరో కొత్త రికార్డు ను కైవసం చేసుకుంది.స్వదేశం లో క్రమంగా పది టెస్ట్ సిరీస్ లను గెలుచుకున్న జట్టుగా నిలిచింది.ఇంతకుముందు ఈ అరుదైన రికార్డు ఆస్ట్రేలియా రెండు సార్లు సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ రికార్డు భారత్ ఖాతాలోకి వొచ్చింది.ఆస్ట్రేలియా ఈ రికార్డు ను 1994/95-2000/2001లో వొకసారి, 2004-2008/09లో మరొకసారి చేజిక్కుచ్చుకింది.
అలాగే ఆస్ట్రేలియా పై ఈ మధ్య జరిగిన సిరీస్ విజయం తో ప్రారంభించిన భారత్ క్రమంగా విండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌లపై సిరీస్ విజయాలను భారత్ రుచి చూసింది.ఇప్పుడు విండీస్ పై మరొక సిరీస్ ను గెలుచుకుంది.