భారత్ కి ఘన విజయం.

SMTV Desk 2018-10-14 19:07:13  testmatch,westindies,teamindia

హైదరాబాద్;హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో విండీస్ పై 10 వికెట్ల తేడాతో భారత్ విజయం సాదించింది.రెండో ఇన్నింగ్స్ లో విండీస్ 127 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో టెస్టులోనూ మూడు రోజుల్లోనే ఆట ముగిసింది.విండీస్ నిర్దేశించిన 72 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీంఇండియా ఆ లక్ష్యాన్ని అవలీలగా చేదించింది. రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో భారత్ సొంతం చేసుకోగా, టెస్ట్ మ్యాచ్చుల్లో తొలిసారి బౌలర్ ఉమేశ్ యాదవ్ పది వికెట్లు పడగొట్టడం విశేషం.అలాగే విండీస్ తో 5 వన్డేలు,3 టీ-20 మ్యాచ్చులు భారత్ ఆడనుంది.
*విండీస్ తొలి ఇన్నింగ్స్ 311/ఆలౌట్,రెండో ఇన్నింగ్స్ 127/ఆలౌట్
*భారత్ తొలి ఇన్నింగ్స్ 367/ఆలౌట్,రెండో ఇన్నింగ్స్ 72/౦