కోహ్లీ పై కార్ల్ హూపర్ సంచలన కామెంట్స్

SMTV Desk 2018-10-14 17:08:08  kohli, carl hooper,

వెస్ట్ ఇండీస్ మాజీ క్రికెటర్ కార్ల్ హూపర్ టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీ పైన సంచలన కామెంట్స్ చేసాడు. విరాట్ కోహ్లీ మంచి ఆటగాడని కానీ సచిన్ లాగ గొప్ప ప్లేయర్ కాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు. సచిన్ ఎందరో దిగ్గజ ఫాస్ట్ బౌలర్లు ను అలవోకగా ఎదురుకున్నాడు . వసీం అక్రమ్ , వాకర్ యూనిస్, వాల్ష్ లాంటి బౌలర్లు ను ధీటుగా ఎదురుకున్నాడు.. కానీ కోహ్లీ గొప్ప ప్లేయర్ కావడానికి చాల సమయం పడుతుంది అని వ్యాఖ్యానించాడు. అతడి రిటైర్మెంట్ కొచ్చేసరికి కోహ్లీ గొప్ప క్రికెటర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అని పేర్కొన్నాడు. ప్రస్తుతం కోహ్లీ తన దైన శైలిలో దూసుకుపోతున్నాడు