ధవన్ కి కొత్త పేరు...!

SMTV Desk 2018-10-14 17:03:39  shikardhawan,harbhajansing,teamindia

న్యూఢిల్లీ;శిఖర్ ధావన్,హర్బజన్ సింగ్ వీరిద్దరూ ఇప్పుడు జరుగుతున్నఏ టెస్ట్ మ్యాచ్ ఆడడం లేదు. ఐనప్పటికీ అభిమానులు మాత్రం వీళ్ళ వైపు నుండి చూపు తిప్పుకోలేకపోతున్నారు.వీరు సామాజిక మాధ్యమాల్లో తమదైన శైలిలో ట్వీట్లు చేస్తూ అభిమానులందరినీ ఆకట్టుకుంటున్నారు.మొన్నటి వరకు హర్బజన్ సింగ్ విండీస్ పై చేసిన కామెంట్ ట్వీట్ లు వైరల్ అవ్వగా,ఇప్పుడు మల్లి వీళ్ళిద్దరి ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.అసలు విషయం ఏంటంటే,శిఖర్ ధవన్ ఇన్‌స్టాగ్రామ్‌ లో తన ఫోటో పోస్ట్ చేసాడు.దీనిపై స్పందించిన హర్భజన్ సింగ్ డాకు అని కామెంట్ చేసాడు. డాకు అంటే హిందీలో బందిపోటు అని అర్ధం.దీనికి నెటిజన్లు కూడా అచ్చం అలాగే ఉన్నాడని, ఆ పేరు సరిగ్గా సరిపోయింది అని కామెంట్లు చేసారు.ధవన్ భజ్జీ చేసిన కామెంట్ కి స్పందిస్తూ తనకూ వో పేరు పెడుతున్నాను అంటూ జగ్గా జాట్ అని కామెంట్ చేశాడు. జగ్గా జాట్ అనగా ధనవంతుల నుంచి దోచుకుని పేదలకు పంచే వ్యక్తిగా 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన పంజాబ్‌ యోధుడి పేరే ‘జగ్గా జాట్’.వీళ్ళిద్దరు వొకరికొకరు పెట్టుకున్న పేర్లు అలాగే వీళ్ళ సంభాషణ తీరు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.ప్రస్తుతం ధవన్ ఈ మధ్య జరిగిన ఆసియా కప్ లో చురుగ్గా ఆడి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.