దక్షిణాఫ్రికాదే టీ 20 సిరీస్

SMTV Desk 2018-10-14 14:54:54  south africa,zimbambwe,t20

పొట్‌చెఫ్‌స్ట్రూమ్‌:జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా వొక మ్యాచ్‌ ఉండగానే 2-0తో చేజిక్కించుకుంది. రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట జింబాబ్వే .. ఎంగిడి (2/36), పీటర్సన్‌ (2/22), ఫ్రైలింక్‌ (2/20)ల ధాటికి 20 వోవర్లలో 7 వికెట్లకు 132 పరుగులే చేసింది. సీన్‌ విలియమ్స్‌ (41) టాప్‌ స్కోరర్‌. డుమిని (33 నాటౌట), క్లాసెన్‌ (22), డికాక్‌ (26) మెరుపులతో లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లే కోల్పోయి ఛేదించింది. ఆదివారం ఆఖరి టీ20 జరుగుతుంది.