రాజీనామా చేసిన కేంద్ర మంత్రి

SMTV Desk 2018-10-14 14:04:29  mee too allegation, MJ akbar ,

పలువురు మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ ఆదివారం రాజీనామా చేశారు. నైజీరియా నుంచి స్వదేశానికి చేరుకున్న ఆయన వెంటనే రాజీనామా చేసినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఉదయం ఎయిర్ పోర్టులో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులివ్వకుండా వెళ్లిపోయారు.

ర్వాత ప్రధాన మంత్రి కార్యాలయానికి రాజీనామా లేఖ పంపారని, దీన్ని రాష్ట్రపతి ఆమోదించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. అయితే ఈ విషయాన్ని పీఎంఓ అధికారికంగా ధ్రువీకరించేదు. 14 మంది మహిళలపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడిన అక్బర్‌ను వెంటనే పదవి నుంచి తప్పించాలని పలువురు బీజేపీ నేతలతోపాటు ఆరెస్సెస్ కూడా హుకుం జారీ చేసింది.

అక్బర్ తనను వేధించాడని ప్రియా రమణి అనే మహిళా జర్నలిస్టు చెప్పడం కలకలం రేపింది. తర్వాత మరో 13 మంది మహిళలను ఆయన కీచకుడని, ఇంటర్వ్యూల్లో, హోటల్ గదుల్లో చర్చల సయమంలో తమపై లైంగిక దాడికి యత్నించారని ‘మీటూ’ కింద తెలిపారు. అక్బర్ గతంలో ది టెలిగ్రాఫ్, ఆసియన్ ఏజ్, ది సండే గార్డియన్ తదితర పత్రికల్లో పనిచేసినప్పుడు ఈ కీచకానికి పాల్పడ్డారని చెప్పారు. దీంతో ఆయనను తప్పించాలని మోదీ సహా పలువురు సీనియర్ నేతలు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మరింత నష్టనివారణ జరగకుండా అక్బర్ నైజరియా నుంచి రాగానే వివరణ ఇప్పించి రాజీనామా చేయిస్తారని ఇదివరకే వార్తలు వచ్చాయి. అయితే వివరణ కూడా అక్కర్లేకుండా రాజీనామా చేయించినట్లు సమాచారం.