తల్లీ బిడ్డను బలిగొన్న డెంగ్యు వ్యాది...

SMTV Desk 2018-10-14 13:06:51  andrapradesh,vishakapatnam,rajam mandal, pogiri village

రాజాం మండలం పొగిరి గ్రామం లో విషాదం. పెళ్లై ఏడాది కూడా కాలేదు,ఇంటికి చేసిన ముస్తాబూ చెదిరిపోలేదు,కాళ్ళ పారాణి ఆరలేదు.ఇంతలోనే డెంగ్యు వ్యాది తనని కాటేసింది.తను ఇప్పుడు నిండు గర్భిని కూడా.ఆ డెంగ్యు వ్యాదితో తల్లీ,బిడ్డా ఇద్దరు మృత్యువాత పడ్డారు.వివరాల ప్రకారం రాజం మండలం పొగిరి గ్రామానికి చెందిన సుంకర సీతమ్మ(24) డెంగ్యు వ్యాదితో శనివారం మృతి చెందారు.తనకి 9 నెలల క్రితం అదే గ్రామానికి చెందిన సింహాచలం తో వివాహం అయ్యింది.ప్రస్తుత్రం 8 నెలల గర్భిని, పొత్తి కడుపులోని బిడ్డను తాకుతూ ఆ ఇల్లాలు మురిసిపోయింది. పండంటి బిడ్డకు జన్మనిస్తానని కలలు కనింది. అంతా సజావుగా సాగితే మరో నెలలో బిడ్డకు జన్మనిచ్చేదే. కానీ విధి వంచించింది. ఆ భార్యాభర్తల అన్యోనతను చూసి కుళ్లుకుంది. పొత్తిళ్లలో ఎదుగుతూ లోకాన్ని చూడాల్సిన బిడ్డపై పగ పట్టి డెంగీ రూపంలో ప్రాణాలు తీసింది. వారం రోజుల క్రితం సీతమ్మకు జ్వరం రావటంతో సాధారణ జ్వరంగానే కుటుంబ సభ్యులు భావించారు. గర్భిణి కావటంతో నిర్లక్ష్యం చేయకుండా ఆగమేఘాలపై రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించడంతో వెంటనే విశాఖపట్టణంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆమె మృతి చెందింది. పసిబిడ్డతోపాటు తల్లి మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావటంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.