సీఎం రమేష్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

SMTV Desk 2018-10-14 12:43:34  cm ramesh,it,tdp,bjp

హైదరాబాద్,బొరబండ;రాజ్యసభ సభ్యులు,తెదేపా నేత సీఎం రమేష్ ఆస్తులపై ఐటీ శాఖా కన్ను వేసింది.శుక్రవారం ప్రారంభించిన ఈ సోదాలు శనివారం ముగిశాయి.జూబ్లిహిల్ల్స్ లోని తన ఇంట్లో 3.53 లక్షల నగదు, సీఎం రమేష్‌, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న 14 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. రమేష్‌ ఇంట్లో లాకర్‌ను గుర్తించిన అధికారులు దాన్ని తెరవడానికి ప్రయత్నించగా.. అది రమేష్‌ వేలిముద్రల ద్వారా మాత్రమే తెరుచుకుంటుందని కుటుంబ సభ్యులు చెప్పారు. దాంతో దిల్లీలో ఉన్న ఆయనను ఐటీ అధికారులు పిలిపించారు. శుక్రవారం రమేష్‌కు చెందిన సంస్థల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, కొన్ని హార్డుడిస్కులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం పూర్తిగా ఆయన ఇంట్లో సోదాలకే పరిమితమయ్యారు. అలాగే రమేష్‌ సొంతూరు కడప జిల్లా పోట్లదుర్తిలో చేపట్టిన సోదాలు శుక్రవారమే ముగిశాయి.
*సోదా పూర్తయ్యాక పంచనామా పత్రాలు విలేకరులకు చూపిన తరువాత రమేష్ విలేకరులతో మాట్లాడారు.‘నేను కరడు గట్టిన తెలుగుదేశం వాదిని. భాజపాలోకి రమ్మని అడుగుతున్నారు. సోదాలకు వచ్చిన అధికారులు సైతం మీరు భాజపాతో ఎందుకు పెట్టుకున్నారని అడిగారు’ అని పేర్కొన్నారు.ఇదివరకు జీఎస్టీ అధికారులు చేసిన సోదాల గురించి ఎవ్వరికి చెప్పలేదు అని అలాగే తనని భయాందోళనలకు గురిచేసేందుకు తన పై దాడులు చేస్తున్నారు అని ఈ బెదిరింపులకు భయపడేది లేదనీ, పూర్తి వివరాలు ఆదివారం వెల్లడిస్తానన్నారు.
అంతే కాకుండా రాజకీయ కక్ష్యల వల్లే తన పై దాడి చేయిస్తున్నారు అని ఆరోపించారు.ఐటీ అధికారుల సూచన మేరకు శనివారం దిల్లీ నుంచి తన నివాసానికి చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. తన వేలిముద్రలతో డిజిటల్‌ లాకర్లను తెరిచేందుకు ఐటీ అధికారులు హైదరాబాద్‌ రమ్మన్నారని, అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. అధికారులు సహకరిస్తే తన ఇంట్లో జరుగుతున్న సోదాలను వీడియో తీసి మీడియాకు పంపిస్తానన్నారు. ఐటీ అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తన భార్య పేరిట నోటీసులు వచ్చాయని పేర్కొన్నారు. దిల్లీకి డబ్బులు తరలించాననడంలో వాస్తవం లేదనీ, నాలుగేళ్లలో రూ.200 కోట్ల వరకు పన్ను చెల్లించానని చెప్పారు. భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తనపై చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. సమయం చెబితే ఆదివారం ఉదయమే చర్చకు వస్తానని పేర్కొన్నారు. రిత్విక్‌ కంపెనీలో సోదాలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.