మళ్ళీ ఒక రికార్డును బద్దలుకొట్టిన కోహ్లి...

SMTV Desk 2018-10-13 18:16:05  teamindia,testmatch,viratkohli

హైదరాబాద్;టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లి కి మరొక రికార్డు స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాడు. అత్యదిక పరుగులు సాధించిన ఆసియన్ కెప్టన్ గా మరొక రికార్డు కొల్లగొట్టాడు.ఈ రికార్డ్ ఇంతకుముందు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ పేరిట ఉండగా ఇప్పుడు విరాట్ కోహ్లి దాన్ని తుడ్చివేశాడు.హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా విరాట్ కోహ్లి 45 పరుగులు చేసి ఈ రికార్డు సాదించాడు.ఇదివరకు వున్న రికార్డు వివరాలు మిస్బా 56 మ్యాచ్చుల్లో 51.36 పరుగుల తో మొత్తం 4,214 పరుగులు చేయగా,ఇందులో మిస్బా 8 సెంచరీలు చేశాడు.కోహ్లి మాత్రం 42 మ్యచ్చుల్లోనే 65.12 సగటుతో 4,233 పరుగులు చేసి పాత రికార్డు ని బద్దులు కొట్టాడు.ఇలా అతనికి ఈ బిరుదు దగ్గరలో కి వొచ్చింది.అంతే కాకుండా ఇప్పటి వరకు తన టెస్ట్ కెరీర్ లో 24 సెంచరీలు చేసిన కోహ్లి మరో శతకం పూర్తి చేస్తే ,వేగంగా 25 సెంచరీలు పూర్తి చేసుకున్న రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు .ఇదివరకు ఈ రికార్డు డాన్ బ్రాడ్‌మన్‌ మీద ఉంది. ఇతను 68 ఇన్నింగ్స్‌లో 25 సెంచరీలు చేశాడు.