'మీ టూ' బీసిసిఐ వరకు వచ్చింది.

SMTV Desk 2018-10-13 17:15:43  bcci,meetoo,rahuljohri

దిల్లీ; మీ టూ ఎక్కడ ఆగకుండా శరవేగంగా దూసుకెళ్తుంది .దేశం లో అన్ని మూలలకు చేరుకుంటుంది.ఇప్పుడు బీసిసిఐ వరకు వచ్చింది.బీసిసిఐ సీఇవో రాహుల్ జోహ్రీ తనను వేదింపులకు గురి చేశాడంటూ వొక పాత్రికేయురాలు వెల్లడించింది.దీనికి సంబందించిన మెయిల్లను వొక నెటిజన్ షేర్ చేశాడు.‘మీడియాలో పనిచేసిన ఓ ప్రముఖ వ్యక్తి గురించి చాలా ఈమెయిళ్లను బాధితురాలు షేర్‌ చేసింది. కానీ, పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు. రాహుల్‌ జోహ్రీ నీకు సమయం వచ్చింది’అంటూ ఆ నెటిజన్ ట్వీట్ చేశాడు.ఆ బాధితురాలు మాత్రం ఈ విధంగా తెలిపింది.‘రాహుల్‌ జోహ్రీ ప్రస్తుతం బీసీసీఐ సీఈవోగా ఉన్నారు. రాహుల్‌ నా మాజీ సహోద్యోగి. విధుల్లో భాగంగా మేం బయటికి వెళ్లినప్పుడు ఆయన నన్ను తాకడానికి ప్రయత్నించేవారు. ఎక్కడున్నావ్‌? కాఫీకి వెళ్దామా అంటూ ఫోన్లు చేసేవాడు. వొకసారి వో కొత్త న్యూస్‌ ఛానల్‌ ప్రారంభోత్సవానికి నన్ను రమ్మని పిలిచాడు. నేను అందుకు నిరాకరించాను. ఆ మరుసటి రోజే నేను ఉద్యోగం రీత్యా ఇబ్బందుల్లో పడ్డాను. నాకు ఉద్యోగం చాలా అవసరం. అప్పటి నుంచి ఆయన పిలిచినప్పుడు ఎక్కడయికైనా వెళ్లాలంటే రానని చెప్పకుండా ఉండలేకపోయాను. కానీ, నేను నా హద్దుల్లో ఉండటం ఆయనకు నచ్చేది కాదు. నా పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు. వోసారి నాతో వింతగా ప్రవర్తించేసరికి ఆయన మీద నేను గ్లాస్‌ విసిరేశాను. అయినా ఆయన ప్రవర్తన మారలేదు’అని తన ఆవేదన వ్యక్తం చేసింది. రాహుల్ జోహ్రీ ఇంతకు ముందు డిస్కవరీ నెట్‌వర్క్స్‌ ఆసియా పసిఫిక్‌కు జనరల్‌ మేనేజర్‌, ఎక్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేసారు తరువాత 2016 ఏప్రిల్‌లో బీసీసీఐ కి సీయీవో గా నియమితులయ్యారు.