అవి నా జీవితంలో చీకటి రోజులు;యువీ

SMTV Desk 2018-10-13 12:08:58  teamindia,worldcup,yuvarajsing,

ముంబై;2011 టీమిండియా ప్రపంచకప్ అనగా మొదట గుర్తొచ్చేది యువరాజ్ సింగే, యువీ అలా తన ఆటని ఆడాడు 362 పరుగులు తీసి రికార్డు చేసి,బౌలింగ్ లో కూడా 15 వికెట్స్ తీసి తన ప్రతిభను చూపాడు.ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా కూడా నిలిచాడు.ప్రపంచ కప్ గెలిచాక అందరు తమ తమ కుటుంబాలతో కలిసి ఆనదంగా గడిపారు.ఎవరి వల్ల అయితే ఆ విజయం దక్కిందో అతనికే ఆ ఆనందం ఎంతో కాలం లేకుండా పోయింది. అతనికి క్యాన్సర్ ఉందని కొద్ది రోజుల తర్వాత తెలిసింది దాంతో అతను పడ్డ కష్టం,సాధించిన విజయాన్ని ఆహ్వాదించ లేకపోయాడు.
‘ప్రపంచకప్‌ విజయం తర్వాత క్యాన్సర్‌ ఉందని తెలియడం నా ఆనందాన్ని వొక్క క్షణంలో చిదిమేసింది. అవి నా జీవితంలో చీకటి రోజులు. నువ్వు ప్రపంచకప్‌ గెలిచినప్పుడు, నువ్వు మ్యాన్‌ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైనప్పుడు శిఖరాన్ని అధిరోహించినట్టు ఉంటుంది. కానీ, అకస్మాత్తుగా అగాథంలోకి పడిపోయా. జీవితం ఇంతే. ఏం జరుగుతుందో తెలియదు. మరో అవకాశమే ఇవ్వదు’అని యువీ అన్నాడు.
ప్రస్తుతం విజయ్‌ హజారే ట్రోఫీలో మనకు వొకప్పటి యువీ కనిపిస్తున్నాడు.ఇంగ్లాండ్ వెళ్లి సాధన చేసి మంచి ఫిట్‌నెస్‌ సాధించాడు.విజయ్ హజారేలో జరిగిన ఏడు మ్యాచ్చుల్లో 264 పరుగులు సాధించి ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు.అలాగే 2019 ప్రపంచ కప్ లో ఆడలన్నదే తన లక్ష్యంగా చేసుకొని శ్రమిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.