ఏకపక్షంగా శాసనసభ రద్దు...!!

SMTV Desk 2018-10-12 17:30:10  high court, Voters,dk. aruna, Shashank Reddy

హైదరాబాద్ ,అక్టోబర్ 12: ప్రజాప్రతినిధులందరికీ తెలియజేయకుండా ఏకపక్షంగా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం రాజ్యాంగ విరుద్దం అంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు డికె.అరుణ, శశాంక్ రెడ్డి వేసిన పిటిషన్లపై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షల వాదనలు విన్న తరువాత రెండు పిటిషన్లను కొట్టివేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటిషనుపై ఆయన తన వాదనను నిరూపించుకొనేందుకు హైకోర్టు హైదరాబాద్ ,అక్టోబర్ 12: ప్రజాప్రతినిధులందరికీ తెలియజేయకుండా ఏకపక్షంగా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం రాజ్యాంగ విరుద్దం అంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు డికె.అరుణ, శశాంక్ రెడ్డి వేసిన పిటిషన్లపై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షల వాదనలు విన్న తరువాత రెండు పిటిషన్లను కొట్టివేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటిషనుపై ఆయన తన వాదనను నిరూపించుకొనేందుకు హైకోర్టు వొక అవకాశం ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు ఓటర్ల జాబితాను విడుదల చేసిన తరువాత దానిలో అవకతవకలను గుర్తించి కోర్టుకు సమర్పిస్తానని మర్రి శశిధర్ రెడ్డి తరపు న్యాయవాది చెప్పారు. దానిపై కూడా విచారణ పూర్తయితే (కాంగ్రెస్ నేతలు మళ్ళీ కేసులు వేయకపోతే) ఇక ముందస్తు ఎన్నికలకు సంబందించి అన్నీ కేసులు పూర్తయినట్లే.