దొంగల ముఠా గా మోహన్ లాల్ !

SMTV Desk 2018-10-12 17:25:45  MOHAN LAAL ,

మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు టాలీవు డ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ చిత్రం ‘జనతా గ్యారేజ్’లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించి ఆయ న తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అదేవిధంగా ‘మన్యంపులి’ చిత్రంతోనూ ఆకట్టుకున్నాడు. ఇక మోహన్‌లాల్, నివిన్ పాళీ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ చారిత్రక చిత్రం ‘ఖాయం కులమ్ కొచ్చున్ని’ కేరళలో గురువారం ప్రేక్షకుల ముందు కు వచ్చింది. 1839 కాలం నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఆంగ్లేయులపై నాడు పోరాడిన దొంగల ముఠా కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి మలయా ళంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి అను వదించి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.