తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్....

SMTV Desk 2018-10-12 16:04:48   IMF, India growth rate,WEO

అక్టోబర్ 12: భారత్‌ వృద్ధిరేటుపై అంచనా వేసింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) . 2018లో భారత్ వృద్ధిరేటు 7.3 శాతంగా, 2019లో 7.4 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ వెల్లడించింది . ఈ నేపథ్యంలో 2017లో భారతదేశం 6.7 శాతం వృద్ధి రేటును సాధించింది.

కాగా 2018లో భారత్ వృద్ధిరేటు 7.3 శాతం, 2019లో 7.4 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేశారు . ఇది 2017లో భారత వృద్ధి రేటు 6.7 శాతం కంటే ఎక్కువ. అని తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ రిపోర్టులో ఐఎంఎఫ్ పేర్కొంది అని చెప్పారు .

బాలీలో జరిగిన ఐఎంఎఫ్ వార్షిక సమావేశానికి ముందు వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ (WEO) విడుదల చేసింది. "భారతదేశంలో ఇటీవలి కాలంలో అనేక సంస్కరణలు ఫలప్రదంగా అమలు చేయబడ్డాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), ద్రవ్యోల్బణ లక్ష్య ప్రణాళిక సహా విదేశీ పెట్టుబడులను అమలుచేయడానికి చర్యలు తీసుకోవడం, వ్యాపారాన్ని సులభతరం చేయడం లాంటివి అందులో కొన్ని.. అని ఐఎంఎఫ్ పేర్కొంది.

మరోవైపు భారత్ జీడీపీ వేగం పెంపొందించుకుంటుందని , ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో వృద్ధిరేటు 7.3 శాతంగా, వచ్చే రెండేళ్లలో 7.5 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ ఆదివారం వెల్లడించారు .

అన్ని దేశాల వ్యాప్తంగా పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశంగా మొదటి స్థానంలో భారత్ అవతరించిందని.. సామాజిక, ఆర్థిక రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పుల ఫలితంగా వృద్ధిరేటు క్రమంగా పెరుగుతున్నదని ప్రధాని మోదీ ఆదివారం ఉత్తరాఖండ్ రాష్ట్రం తొలిసారిగా ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్ల సదస్సు 2018లో అన్నారు. దేశంలో ద్రవ్యలోటు తగ్గుముఖంపట్టి నందున ఆయన.. భారత్‌లో పెట్టుబడులకు స్వర్గధామమని, దేశంలో అమలవుతున్న సులభ వాణిజ్య విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు .