ఎయిర్ ఇండియా విమానంకు తృటిలో తప్పిన ప్రమాదం ...!

SMTV Desk 2018-10-12 13:48:34  Kerala , Air India Flight

కేరళ,అక్టోబర్ 12 : ఎయిర్ ఇండియా విమానంకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కేరళలోని త్రిచి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం వొకటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రహారీ గోడను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమయంలో మొత్తం 136 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. దుబాయ్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం అదుపు తప్పి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గోడను ఢీకొట్టింది. గోడ ధ్వంసం కాగా విమానం కూడా స్వల్పంగా ధ్వంసం అయ్యింది. ఇక ముంబై విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా పరీక్షించారు. అనంతరం ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు. విమానం త్రిచిలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రహరీ గోడను ఢీకొట్టడంపై అతర్గత విచారణకు ఆదేశించినట్లు ఎయిర్ఇండియా సంస్థ వొక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు పైలట్, కోపైలట్లు వివరణ ఇవ్వాల్సిఉన్న నేపథ్యంలో వారి స్థానంలో మరొకరిని నియమించినట్లు తెలిపింది ఎయిర్ ఇండియా సంస్థ. మరోవైపు జరిగిన ఘటనపై పౌరవిమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్‌కు కూడా సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారని వారిని అక్కడి నుంచి మరో విమానంలో దుబాయ్‌కు పంపినట్లు వెల్లడించారు.