వెంకన్న సన్నిధిలో సచిన్

SMTV Desk 2017-07-20 10:33:48  Sachin, who, visited, Venkateswara, Swamy

తిరుమల, జూలై 20 : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అతని భార్య అంజలి ఇద్దరు కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. సచిన్ బుధవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి తిరుపతి కి చేరుకున్నారు. గురువారం ఉదయం దర్శన సమయానికి ఆలయానికి చేరుకున్న సచిన్ దంపతులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తరువాత వీఐపీ దర్శనం చేసుకున్నారు. దర్శననంతరం మండపంలోని వేద పండితులు వారిని శేష వస్త్రాలతో సత్కరించారు. అనంతరం వారికి తీర్ధప్రసాదాలు అందజేశారు. సచిన్ తో పాటు హైదరాబాద్ క్రికెట్ సంఘ నాయకులు చాముండేశ్వరి నాథ్, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.