వన్డే టికెట్ల ధర తగ్గింపు....

SMTV Desk 2018-10-11 18:52:00  teamindia, westindies, bcci

హైదరాబాద్;ఈ నెల 24 న జరిగే భారత్,వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మ్యాచ్ విశాఖపట్నం లో నిర్వహించగా వాటి టికెట్ల ధర తగ్గించారంటు వార్తలొచ్చాయి.బీసీసీఐ కొత్త రాజ్యాంగ నిబంధనల ప్రకారం 90 శాతం టికెట్లను విక్రయానికి ఉంచి, రు. 3,500 కాంప్లిమెంటరీ పాస్ లు,అలాగే వివిధ ప్రాంతాల్లో 10 ఆఫ్ లైన్ కౌంటర్ల ద్వారా 6,౦౦౦ టికెట్లు విక్రయించడానికి సిద్దం చేస్తున్నారు అని ఏంటీ కృష్ణబాబు (రెండో వన్డే నిర్వాహక కమిటీ చైర్మన్) తెలిపారు.
అలాగే కాంప్లిమెంటరీ పాస్ ల వివాదంతో ఆథిత్యం విశాఖకు మారింది.
టికెట్ ధరల విషయానికొస్తే యూనిమోని ఇండియా ప్రకారం ధరలు తగ్గించారని చెప్తున్నారు. రూ.6,000 టికెట్‌ను రూ.4,000కు, రూ.3500ను రూ.2,500కు, రూ.2,500 టికెట్‌ను రూ.2,000కు విక్రయించనున్నట్లు సమాచారం. మిగతా టికెట్ల ధరలు రూ.1,800, రూ.1,200, రూ.750, రూ.500, రూ.250గా ఉండబోతున్నాయి అని వెల్లండించారు.ఇది ఇలా ఉండగా ఈ నెల 12 న హైదరాబాద్ లో జరిగే భారత్,వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ కోసం కోహ్లి సేన నగరానికి చేరుకుంది.