రాహుల్ పగటి కలలు కనటం మానుకోవాలి

SMTV Desk 2018-10-11 11:21:34  Amit shah , Jobs in India

అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధానంగా దృష్టి పెట్టింది వలస వాదులను బయటకు వెళ్లగొట్టడంపైనే. ఇప్పటికే అదే పాయింట్ గురించి తీవ్రంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్. ట్రంప్ నిర్ణయాలు నచ్చాయో లేక రాబోయే ఎన్నికలకు ప్రజలను బుట్టలో వేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో తెలియదు గాని బీజేపీ కూడా వలస వాదులను వెళ్ళగొడతాం అంటుంది.

తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తే వలస వాదులను, అక్రమ చొరబాటుదారులను గుర్తించి దేశం నుండి పంపించివేస్తామని చెప్పారు. రాహుల్ వచ్చే ఎన్నికల కోసం పగటి కలలు కనటం మానేస్తే మంచిదని హితవు పలికారు.

దేశభద్రతకు బీజేపీ కట్టుబడి ఉందని, నేషనల్ రిజిస్టర్ అఫ్ సిటిజెన్స్ నివేదిక ప్రకారం దేశంలో 40 లక్షల అక్రమ చొరబాటుదారులు ఉన్నారని, వారందరిని అధికారం లోకి వస్తే దేశం నుండి పంపించేస్తామని అమిత్ షా అన్నారు. అక్రమ చొరబాటుదారులు వలన దేశంలో యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని, ప్రతి పక్ష పార్టీలకు అది కనిపించట్లేదని అమిత్ షా అన్నారు. కాగా బీజేపీ తనపై ఉన్న అనేక ఆరోపణలను తప్పు దోవ పట్టించేందుకే తలాతోకా లేని ఇలాంటి ప్రమాణాలు ఎన్నికల ముందు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా గడ్కరీ కూడా బీజేపీ గత ఎన్నికలలో ఆచరణ సాధ్యం కానీ హామీలను కేవలం అధికారం కోసమే ఇచ్చింది అని వొక ఛానల్ కు చెప్పిన విషయం నుండి ప్రజలను ద్రుష్టి మళ్లించేందుకే ఇలాంటివి అమిత్ షా చేస్తున్నట్టు వారు భావిస్తున్నారు.