13న ప్రీ రిలీజ్ ఫంక్షన్

SMTV Desk 2018-10-10 18:23:29  ram , anupama , trinath rao , devi sriprasad

రామ్ హీరోగా దిల్‌రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలుగా త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ ఎంటర్‌టైనర్ ‘హలో గురు ప్రేమ కోసమే’. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలోని పాటలను సోమవారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సినిమాను దసరా సందర్భంగా ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ “సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో చిత్రంపై ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత కెమిస్ట్రీ ప్రేక్షకులను మైమరపిస్తుంది. మా బ్యానర్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలకు సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈనెల 10న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. అలాగే ఈనెల 13న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నాం. దసరా సందర్భంగా ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం”అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః విజయ్ కె.చక్రవర్తి, ఆర్ట్‌ః సాహి సురేశ్, ఎడిటింగ్‌ః కార్తీక శ్రీనివాస్, మాటలుః బెజవాడ ప్రసన్నకుమార్, రచనా సహకారంః సాయికృష్ణ.