‘అరవింద సమేత..’కు యు/ఎ సర్టిఫికెట్..

SMTV Desk 2018-10-10 15:44:51   Jr. NTR, Pooja Hegde , Trivikram , Thaman S

యంగ్ టైగర్ ఎన్ టిఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత..వీర రాఘవ’. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రయూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు.కీలక పాత్రలల్లో జగపతి బాబు, ఈషా రెబ్బా, సునీల్ నటిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 11 ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.