త్రివిక్రం రైటింగ్.. పవన్ స్పీచ్..!

SMTV Desk 2018-10-10 15:27:01  Tribikram, Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన అధ్యక్షుడిగా 2019 రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్ చూపించాలని చూస్తున్న పవన్ మీటింగ్ లో ఆవేశంగా మాట్లాడటం చూస్తూనే ఉంటాం. అయితే పవన్ మీటింగ్స్ లో మాట్లాడే మాటలు త్రివిక్రం రాసిస్తాడని కొందరి మాట. వారిద్దరి మధ్య సన్నిహిత్యం తెలిసిన వారు అది నిజమే అనుకుంటారు.

దీనిపై త్రివిక్రం వివరణ ఇచ్చుకున్నారు. తనకు కథ రాసుకునేందుకే సంవత్సరాలు పడుతుంటే తాను పవన్ కు స్క్రిప్ట్ రాసివ్వడం ఏంటని అంటున్నాడు త్రివిక్రం. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. అయినా పవన్ ఏం మాట్లాడాలో అతనికి తెలుసని.. ఇక వారి ఇంటి సభ్యులతో పాటుగా తాను కూడా నీన్న ఏం చేశాడు అన్నది టివిల్లో, పేపర్లో చూసి తెలుసుకోవడం తప్ప తను ఇంకా ఏం చేయలేనని చెప్పాడు త్రివిక్రం.