‘96’ రీమేక్‌లో రానా

SMTV Desk 2018-10-10 15:08:58  Rana , Trisha , Dil Raju

విజయ్ సేతుపతి, త్రిష జంటగా ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘96’. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునేలా దర్శకుడు సినిమాను తెరకెక్కిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయనున్న విషయం తెలిసిందే. అందుకు గానూ ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నారు.

కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ గానీ, నాని గానీ నటించేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు ఇటీవల వార్తలు రాగా.. తాజాగా ఆ లిస్ట్‌లో రానా చేరిపోయాడు. ఈ రీమేక్‌లో నటించేందుకు రానా చాలా ఆసక్తిని చూపుతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మాతృకలో నటించిన త్రిషనే తెలుగులో కూడా నటించాలని అనుకుంటుందని సమాచారం. కాగా త్రిష, రానా మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇదివరకు