బాలీవుడ్ సింగర్ కన్నుమూత

SMTV Desk 2018-10-10 12:55:51  bollywood , nitin bali

ముంబయి : ప్రముఖ బాలీవుడ్ సింగర్ నితిన్ బాలీ కన్నుమూశారు. బోరివలి నుంచి మలాద్ వెళుతున్న సమయంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆయన తలకు, ముఖంపై తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగంగా కారు నడిపాడని ఆరోపిస్తూ పోలీసులు నితిన్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, అనంతరం బెయిల్ ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే నితిన్ చికిత్స చేయించుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆయనకు కడుపు నొప్పి రావడంతో పాటు వాంతులు చేసుకున్నాడు. తక్షణమే ఆస్పత్రికి తరలిస్తుండగా గుండెపోటు వచ్చి మార్గమధ్యంలో చనిపోయాడు. 1990లో నితిన్ పాడిన రీమిక్స్ పాట ‘ నీలీ నీలీ అంబర్ పర్ ’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నితిన్ ప్రముఖ టివి నటి రోమాను పెళ్లి చేసుకున్నాడు. ఆయన మృతిపై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జరగనున్నాయి.