నోటా' ఫ్లాప్ పై ఫ్యాన్స్ కు దేవరకొండ లెటర్

SMTV Desk 2018-10-10 10:37:07  vijay devarakonda, Anand Shankar, MEHARIN

పెళ్లి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ చిత్రాలు మూడు విభిన్నమైన జోనర్ లో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించాయి. విజయ్ దేవరకొండ ఈ మూడు చిత్రాలతో తెలుగులో టాప్ హీరోగా మారిపోయిన విషయం తెల్సిందే. టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకున్న దేవరకొండ ‘నోటా’తో తమిళనాట తన అదృష్టంను పరీక్షించుకున్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నోటా’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తెలుగులో విజయ్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ అయితే దక్కాయి. కాని రెండవ రోజు నుండే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. సినిమా ఫ్లాప్ అని తేలిపోయింది.

‘నోటా’కు ఫ్లాప్ టాక్ వచ్చిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ తో పాటు యాంటీ ఫ్యాన్స్ కు ఓపెన్ లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ లెటర్ లో... నోటా చిత్రాన్ని చేసినందుకు గర్వపడుతున్నాను ఈ చిత్రం ఫెయిల్యూర్ బాధ్యత మొత్తం తనదే. ఈ చిత్రాన్ని ఆధరించిన ప్రేక్షకుల ప్రేమను స్వీకరిస్తున్నాను. ఇదే సమయంలో నోటాపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారి కామెంట్స్ ను కూడా సీరియస్ గా తీసుకుంటున్నాను. తప్పకుండా వాటిని పరిశీలించి తర్వాత సినిమాకు జాగ్రత్తలు తీసుకుంటాను. నా వైపు నుండి ఉన్న తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.