ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రమాదం

SMTV Desk 2018-10-10 10:36:02  UttarPradesh, Railway Accident,

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉదయం రైలు ప్రమాదం జరిగింది. రాయ్‌బరేలీ నుంచి ఢిల్లీ మీదుగా మాల్దాటౌన్ వెళ్లే న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 35 మండి వరకు గాయపడినట్లు తెలుస్తోంది. రాయ్‌బరేలీ స్టేషన్ నుంచి సుమారు 50 కిమీ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఆరుబోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. ప్రమాదం సంగతి తెలియగానే జిల్లా అధికారులు, పోలీసులు, వైద్య బృందాలు, ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించాయి. వారణాసి, లక్నో నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా వచ్చి సహాయ చర్యలలో పాల్గొంటున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన, మృతి చెందినవారి వివరాలను తెలుసుకోవడానికి రైల్వేశాఖ హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించింది.

హెల్ప్‌లైన్‌ నంబర్లు:

రైల్వే ఫోన్ నంబర్- 025-83288

దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్: 05412-254145, రైల్వే -027-73677

పాట్నా స్టేషన్ నం: 0612-2202290, 0612-2202291, 0612-220229.