జెట్‌ ఎయిర్‌వేస్‌ కొత్త సర్వీసులు

SMTV Desk 2017-07-19 18:13:32  jet airwess, aeroplanes,

ముంబై, జూలై 19 : విమానయాన సంస్థ అయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విస్తరణ బాట పట్టింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వాటికి అనుగుణంగా విమాన సేవలు విస్తరించనున్నారు. ఇది అక్కడి పట్టణాల్లోని ఆర్థిక ప్రగతిని ప్రతిబింబిస్తోందని విమానయాన సంస్థ పేర్కొంది. వర్షాకాలంలోని రద్దీని తట్టుకునేందుకు దేశీయ నెట్‌వర్క్‌లోకి 96 కొత్త విమానాలను జత చేయగా దీనిలో 14 చిన్న చిన్న నగరాలకు కనెక్ట్‌ చేశారు. ఈ నాన్‌-స్టాప్‌ డైరెక్ట్‌ సర్వీసులను వినియోగదారులకు నచ్చిన సమయం ఎంచుకోవడానికి వీలు కల్పించడంలో భాగంగా తీసుకురానునట్లు ఎయిర్‌వేస్‌ కంపెనీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ జయరాజ్‌ షణ్ముగం తెలిపారు.