ఇకపై మీ మొబైల్ లోనే ఆధార్

SMTV Desk 2017-07-19 18:13:00  AADHAR, mAadhar, Mobile Phone, UID

న్యూఢిల్లీ, జూలై 19 : ఇప్పటి నుంచి ఆధార్ సంఖ్య ఉన్నవారు ఆ వివరాలను తమ మొబైల్‌ ఫోన్‌లోనే నిక్షిప్తం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మొబైల్ యాప్‌ను భారతదేశ విశిష్ట గుర్తింపు సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆవిష్కరించింది. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ ఫారంపైనే అందుబాటులో ఉంది. త్వరగా, సౌకర్యవంతంగా గుర్తింపు రుజువును భద్రపరచుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఆధార్‌ను తీసుకెళ్లడంతోపాటు ఈ యాప్‌తో ఆధార్‌కు లింకైన తమ బ‌యోమెట్రిక్ డేటాను కూడా యూజర్లు లాక్ లేదా అన్‌ లాక్ చేసుకునే వీలుంటుంది. ఇందులో ఉండే క్విక్ రెస్పాన్స్ కోడ్ ద్వారా ఈకైవైసీ (ఎలక్ట్రానిక్ నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్‌)ను షేర్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. ప్రస్తుతం ఈ యాప్ బీటా వెర్షన్‌లో ఉందని, యూజర్లు ప్రారంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉందని యూఐడీఏఐ ప్రకటించింది. ఆధునికీకరించిన ఆధార్ వివరాలను క్విక్ రెస్పాన్స్ కోడ్ ద్వారా పొందవచ్చను. టెలికమ్యూనికేషన్ కంపెనీల వంటి సర్వీస్ ప్రొవైడర్లకు ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) షేరింగ్‌కు అవకాశం ఉంది. ఎంఆధార్’ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించుకోవాలంటే ఆధార్‌తో లింకున్న మొబైల్ నంబర్ ఉంటేనే ఈ యాప్‌ను వాడుకోవడం జరుగుతుంది.