టీఆర్‌ఎస్‌ని నిలదిసిన గ్రామస్థులు

SMTV Desk 2018-10-06 16:33:33   SIDDIPET,Vadithala Satish Kumar, Villagers

సిద్దిపేట, అక్టోబర్ 06: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అధినేతలు తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నాయకుడు వొడితెల సతీశ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఇ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు తమ వెతిరేకతను తెలిపేందుకు రహదారిపై వేచిఉన్నారు . నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని, తమ గ్రామాన్ని అనవసరంగా అక్కన్నపేట మండలంలో కలిపారని వొడితెలకు వ్యతిరేకంగా నినాదాలకు దిగారు . అదే సమయానికి కాంగ్రెస్ కార్యకర్తలు కొడ అ వివాదంలో ఉండేసరికి వొడితెల సతీశ్‌ కుమార్‌ తన సహనం కోల్పోయి దుర్చుగా ప్రవర్తించాడు. తన కాలికి ఉన్న బూటుతో అందర్నీ తన్నుకుంటూ వెళ్లడంతో ఒక్కసారిగా గ్రామప్రజలందర కంగ్గు తిన్నారు. ఎం జరిగిందో తెలిసేలోపల ఎమ్మెల్యే అనుచరులు ,టీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడికి పాల్పడినారు . ఇ వివాదం 20 నిమిషాలుగా కొనసాగగా అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఉదృతంగా మారిన వాతావరణాన్ని శాంతి పరిచారు .