బారీ ఎత్తున్న రానున్న తుపాను: చెన్నై

SMTV Desk 2018-10-06 14:11:09  chennai,Storm,government alert

చెన్నై, అక్టోబర్ 06 : తిరువనంతపురం, పుదుచ్చేరి, చెన్నైలో తుఫాను హెచ్చరికలు అమలు పరిచారు . వివరాలు ...అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావంతో 4 రోజుల్లో రానున్నభారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సుచన ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేరళ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగాను, అనంతరం తుఫానుగాను మారే అవకాశం చాలా ఉన్నట్లు భారత వాతావరణ పరిశోధన సేక (ఐఎండీ) హెచ్చరించింది. మరోవైపు ఆదివారం కుంభవృష్టికి అవకాశం ఉందంటూ హెచ్చరికలు(రెడ్‌ఎలర్ట్‌) జారీ చేసారు . జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కు చెందిన 5 నియోజక బృందాలు రాష్ట్రానికి నియమించారు .. వాటిని వాయనాద్‌, పాలక్కాడ్‌, ఇడుక్కి, పథనంతిట్ట, కోజీకోడ్‌లలో మోహరించినట్లు సీఎం విజయన్‌ తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరిల్లోనూ బారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కుంభవృష్టి హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి చెన్నైలో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. పుదుచ్చేరిలో 24గంటల్లో 9.5 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ తెలిపారు.