షాక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ..!!

SMTV Desk 2018-10-06 13:49:43  delhi,rahul gandhi,congress Activist

డిల్లీ,అక్టోబర్ 06: దేశానికీ రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యమని పదేపదే చెప్పుకొంటుంన్న కాంగ్రెస్ కార్యకర్తలందరికి షాక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ మాటలు . వివరాలు : డిల్లీలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్‌ సమ్మిట్‌ – 2018 లో మాట్లాడుతూ, “ వచ్చే లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోడీని గద్దె దించడమే మా ప్రధానలక్ష్యం . అందుకోసం దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలన్నిటినీ కలుపుకుపోతాము . ఎన్నికలలో మా కూటమి విజయం సాధించిన తరువాత అందరూ కూర్చొని ప్రధానమంత్రి పదవి గురించి చర్చించుకొంటాము . అందరూ కోరుకొంటే నేను ప్రధానమంత్రి పదవి చేపడతాను,” అని రాహుల్‌గాంధీ చెప్పుకొచ్చారు . ఈ సంభాషణ వింటుంటే రాహుల్‌గాంధీ మాత్రం ప్రధానమంత్రి పదవిపై ఆశలు వదిలేసుకొన్నట్లు తెలుస్తుంది . బిజెపిని, మోడీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలు మద్దతు తప్పనిసరి అని రాహుల్‌గాంధీ మాటలతో స్పష్టం అవుతుంది . కనుక ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి.... రాహుల్‌గాంధీకి ఎంత హక్కు, మోజు ఉంటాయో ప్రతిపక్షాలకు కూడా అంతే ఉంటుంది. కాంగ్రెస్‌ చరిత్రలో ఇంతవరకు ప్రధానమంత్రి పదవి విషయంలో ఈవిధంగా వెనక్కు తగ్గిన దాఖలాలు కనిపించిన సుచనలు లేవు . కనుక ప్రతిపక్షాలలో ప్రధాని పదవి కోసం చిరకాలంగా కలలు కంటున్న డజనుకు పైగా ఉన్న నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తమ కల సాకారం చేసుకొనేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు. ఒకవేళ వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ మిత్రపక్షాలు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే, రాహుల్‌గాంధీ ఏ కేంద్రమంత్రి పదవితోనో సరిపెట్టుకోవడానికి మానసికంగా సిద్దపడుతున్నట్లున్నారు. అంటే యుద్దరంగంలో దిగక ముందే తన రధాన్ని వేరే వాళ్ళకు అప్పగించడానికి సిద్దపడుతున్నట్లే ఉంది. ప్రధానమంత్రి కుర్చీలో కాలుమీద కాలువేసుకొని కూర్చొని దేశాన్ని పాలిస్తాడనుకొన్న యువరాజు మంత్రిగా మిగిలిపోతారా? ఏమో!