40 రోజుల్లో 40 కోట్లు

SMTV Desk 2017-07-19 17:41:24  40, crores, in, 40, days, pawan kalyan, movie

హైదరాబాద్, జూలై 19 : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఈ లోపు ఆయన ఒప్పుకున్నా సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నారు. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా తరువాత పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ కోసం 40 రోజులు కేటాయించారు. ఇందుకు గాను పవన్ రూ. 40 కోట్లు తీసుకుంటున్నారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారని తెలుస్తుంది. అదే నిజమైతే మెగా అభిమానులు మళ్లీ గబ్బర్ సింగ్ సినిమాను గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్నారని సమాచారం.