ధనబలం ఉన్నంత మాత్రాన ప్రజా బలం రాదు :పవన్ కళ్యాణ్

SMTV Desk 2018-10-03 17:51:35  pawan kalyan, money,cm,people

హైదరాబాద్ ,అక్టోబర్ 03: ధనబలం ఉన్నంత మాత్రాన ప్రజా బలం చేకూరదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాజకీయాల్లో డబ్బు ప్రధానం కాదు.. డబ్బే ప్రధానం అనుకుంటే వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇప్పటికే సీఎం అయ్యేవారు. దేశంలోనే ధనవంతుల్లో ఒకరైన ముఖేశ్‌ అంబానీ ప్రధాని అయ్యేవారని పవన్ పేర్కొన్నారు. 2014లోనూ పోటీచేసే సత్తా ఉన్నప్పటికీ .. విభజన తర్వాత నష్టపోయిన రాష్ట్రానికి అనుభవం కలిగిన నేత ఉంటే మంచిదనే టీడీపీకి మద్దతు ఇచ్చానన్నారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉందనే చంద్రబాబును నమ్మి తెదేపాతో జతకట్టామని తెలిపారు. అలాంటి నన్ను తెదేపా నాయకులు తక్కువ చేస్తూ మాట్లాడం.. జనసైనికులను ఇబ్బంది పెట్టడం చాలా బాధించిందన్నారు. ‘పదే,పదే జనసేనకు 4, 5శాతం ఓట్లున్నాయంటున్నారు. ఓటమి గెలుపునకు 2శాతమే తేడా అని మర్చిపోకూడదు. 2019లో రాజకీయాల్లో మార్పులు జరుగుతాయి.. తెదేపా రానున్న ఎన్నికల్లో నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యిందన్నారు. డబ్బుంది కదా ప్రజలు మనల్ని గెలిపిస్తారు అనుకుంటే అది పొరపాటే.. లోకేశ్ నాయుడు వేల కిలోమీటర్ల రోడ్లు వేశామని గొప్పలు చేబుతున్నారు..ఓ సారి బుట్టాయగూడెం వైపు రోడ్డుని పరిశీలించి మీరేసిన రొడ్డు ఎక్కడికి పోయిందో తెలుసుకోండి అంటూ ఎద్దేవా చేశారు.