నా పుట్టిన రోజు సందర్భంగా.... :కేటీఆర్

SMTV Desk 2017-07-19 17:23:34  ktr, trs birthday 24th july harithaharam,

హైదరాబాద్, జూలై 19 : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు ఈ నెల 24న రావడంతో ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలకు ఓ విజ్ఞప్తి చేశారు. తన పుట్టిన రోజున హంగు ఆర్భాటాలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు పాల్గొనడం ఉత్తమమని కేటీఆర్ అభిప్రాయ పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తమ పార్టీ నేతలకు కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు వేడుకలను తమ బంధుమిత్రులతో జరుపుకోవాలనుకుంటారు. ఇక సెలబ్రిటీల పుట్టిన రోజులంటే చెప్పనక్కర్లేదు. సందడి వాతావరణం నెలకొంటుంది. అందులో తెలంగాణలో కీలక నేత, రాష్ట్రమంత్రి అయినప్పటికీ తన పుట్టిన రోజు వేడుకలను సామాన్యుడిలా జరుపుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారు. డబ్బులు ఖర్చు చేయకుండా దానికి బదులు అందరికీ మంచి జరిగే హరిత హారంలో పాల్గొంటే ఉత్తమమని టిఆర్ఎస్ నేతలకు ఆయన సూచించారు. పని చేయడమే ముఖ్యమంటూ తన ఉద్దేశాన్ని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్ చేసిన ట్విట్ పై టిఆర్ఎస్ నేతల నుంచి ప్రశంసల జల్లు వెల్లువెత్తుతున్నాయి.