వ్యక్తుల కంటే జట్టే ముఖ్యం : రవిశాస్త్రి

SMTV Desk 2017-07-19 17:12:00  It, is, important, to, be, more, than, people

న్యూఢిల్లీ, జూలై 19 : భారత్ బౌలింగ్ పై విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి క్రికెట్లో వ్యక్తుల కంటే జట్టే చాలా ముఖ్యమైనది. శాస్త్రిలు, కుంబ్లే లు వస్తుంటారు పోతుంటారు. కాని జట్టు మాత్రం అలాగే ఉంటుందని అన్నారు. శ్రీలంక పర్యటన కు వెళ్తున్న నేపధ్యంలో కోచ్ రవిశాస్త్రి మీడియా తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ గురించి మాట్లాడుతూ నాకంటే ఎక్కువ జట్టులో ఆటగాళ్ళ గురించి భరత్ కు తెలుసు అన్నారు. ఎందుకంటే అతను 15 సంవత్సరాలకు పైగా ఈ వ్యవస్థ లో ఉన్నారు. శ్రీలంక టూర్ సందర్భంగా తను పరిణితి చెందాను. ఈ రెండు వారాల్లో మరింత రాటు తేలుతానని తెలిపారు. శ్రీలంక టూర్ లో భారత్ కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు.