గాంధీ జయంతి నాడే హింస

SMTV Desk 2018-10-02 18:49:50  gandhi jayanthi, bomblost, child died,

బెంగాల్‌ , అక్టోబర్గాం 02 : గాంధీ జయంతి నాడే పశ్చిమ బెంగాల్‌లో హింస చోటుచేసుకుంది. డమ్‌డమ్ ప్రాంతంతో కొందరు దుండగులు పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించారు. ఈ ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృతి చెందగా, అతని తల్లి సహా పదిమందికి పైగా గాయపడ్డారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు మార్కెట్ ప్రాంతం జనాలతో చాలా రద్దీగా ఉన్న సమయంలోనే భారీ శబ్దంతో ఒక్కసారిగా బాంబు పేలింది. గాజు పెంకులు, ఇనుప చువ్వలు దూసుకుని రావడంతో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జీజీ కౌర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతాని పోలీసు క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో బాంబుపేలుళ్లు జరిగిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం సమీపంలో ఈ పేలుళ్లు సంభవించాయి. దీంతో అధికార తృణమూల్‌ దీనిపై తీవ్రంగా మండిపడుతోంది…‘మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొలేకనే గాంధీ జయంతి నాడు రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించారు. ఈ చర్యకు బీజేపీనే పాల్పడింది…’ అని మండిపడింది. ప్రజలకు లండన్‌ లాంటి నగరం అవసరంలేదని, బెంగాల్‌లోనే భద్రత కల్పిస్తే చాలనిఅని సీపీఎం నేతలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.