వారికి నా మొహం ఎలా చూపించాలి?

SMTV Desk 2018-10-02 14:14:39  computer baba,cm, madhya pradesh ,resign

మధ్యప్రదేశ్ , అక్టోబర్ 02: మధ్యప్రదేశ్ మంత్రి ‘కంప్యూటర్ బాబా’ ఎంత ఫేమస్సో తెలిసిందే. పేరుతో ఫేమస్ అయిన నామ్‌దేవ్ త్యాగి ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అకస్మాత్తుగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పట్టుమని ఆరునెలలు కూడా గడవకముందే మంత్రి పదవికి రాజీనామా చేయడం మధ్యప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చేసిన వాగ్ధానాలను నిలబెట్టుకోకపోవడం వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ‘సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నన్ను మోసం చేశారు. నర్మదా నదిలో అక్రమ మైనింగ్‌ని అడ్డుకుంటానని ఆయన హమీ ఇచ్చారు. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఫలితంగా నేను చేసిన వాగ్దానాలను కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో నా అనుచరులకు ఏమని చెప్పాలి. వారికి నా మొహం ఎలా చూపించాలి?’ అని ప్రశ్నించారు కంప్యూటర్ బాబా. అందుకే తాను రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హమీని నిలబెట్టుకోలేకపోయానని.. తన పని గురించి ప్రజలు వందకు తనకు సున్నా మార్కులు వేశారని వాపోయారు. తను రాజీనామా చేయడానికి సీఎం చౌహన్‌నే కారణమని పేర్కొన్నారు. నర్మదా నదిలో జరగుతున్న అక్రమాలను ప్రజలకు తెలిపేందుకు త్వరలో ఓ యాత్రను చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాదిలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఐదుగురు స్వామిజీలకు ‘మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌’ హోదా కల్పించిన విషయం తెలిసిందే.