సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

SMTV Desk 2018-09-30 17:59:18  Software Employee, Hyderabad crime,

మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది.హైదరాబాద్ లోని ఓ సంస్థలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రుషిని (25) ఆత్మహత్య చేసుకుంది. స్థానిక చిత్రపురి కాలనీలోని ఎల్-4 లో 111 ఫ్లాట్ లో నివసిస్తోంది. ఆమె భర్త సందీప్ జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్నాడు. రుపిని ఆత్మహత్యకు కారణం అత్తమామల వేధింపులేనని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. రుపిని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఇతర కారణం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.