మయాంక్ అగర్వాల్‌కు సెలెక్టర్లు ఛాన్స్

SMTV Desk 2018-09-30 16:37:08  India, West indies, Test squad

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడబోయే జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. ‌ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన ఓపెనర్ శిఖర్ ధావన్‌ను విండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి సెలెక్టర్లు పక్కనపెట్టారు. ఇక కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న కర్నాటక బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్‌కు సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. వెస్టిండీస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ మంచి ప్రదర్శన కనబరచడం మయాంక్‌కు కలిసొచ్చింది. ఇక గత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్, దినేష్ కార్తీక్‌లకు ఈ సారి విండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కలేదు. విరాట్ కొహ్లి( కెప్టెన్), కేఎల్ రాహుల్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే( వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్( వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్