జనసేన అధినేత కు షాక్ ఇచ్చిన గ్రామ పెద్దలు

SMTV Desk 2018-09-28 15:04:55  Janasena, Pawan Kalyan,

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామ పెద్దలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చారు. అంతేకాకుండా పవన్ పర్యటనలో ఎవరైనా పాల్గొంటే రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర సంచలనం రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆకు రౌడీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు, పవన్ పై చింతమనేని కూడా అదే స్థాయిలో స్పందించారు. ఈ నేపథ్యంలో, గుడివాకలంక గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.